ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విషయంలో ప్రభు త్వం శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కాను క కిట్ల విషయంలో అంతర్జాతీ య పరిస్థితులకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచేనాటికి కచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి.
– టి.చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి.
చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే
ప్రభుత్వ పాఠశాలలు, అందులో చదువుతున్న పేద, సామాన్య వర్గాలకు చెందిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే చూపుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పట్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే పూర్తి స్థాయిలో కిట్లు అందజేయలేమని చెబుతున్నారు. – ఎం.గణపతిరావు,
విశ్రాంత ఉపాధ్యాయుడు, టెక్కలి.
ప్రభుత్వ పాఠశాలలంటే చులకన
ప్రభుత్వ పాఠశాలలంటే చంద్రబాబుకు చులకన. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేమని చెబు తూ, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇలాంటి ఆంక్షలు వర్తించవా. తక్షణమే పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి.
– పి.వైకుంఠరావు, వైఎస్సార్ టీఎఫ్
నియోజకవర్గ అధ్యక్షుడు, టెక్కలి


