ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు గవర్నర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు గవర్నర్‌ అభినందనలు

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

భువనేశ్వర్‌: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి లోక్‌ భవన్‌లో గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటిని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా దేశం పట్ల అచంచలమైన అంకిత భావం, ఆదర్శప్రాయమైన సేవకు నిదర్శనమైన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంగా పూర్తి చేసినందుకు ద్వివేదిని, భారత సైన్యాన్ని గవర్నర్‌ అభినందించారు. గవర్నర్‌తో కలిసి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ద్వివేది లోక్‌ భవన్‌లోని అటల్‌ వనం సందర్శించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయికి అంకితం చేసిన ఈ ప్రదేశం, ప్రకృతిని, జాతీయ గర్వాన్ని అర్థవంతంగా ఏకం చేస్తుందని ద్వివేది తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అటల్‌ వనంలో ఏర్పాటు చేసిన టీ– 55 యుద్ధ ట్యాంక్‌, 1971 యుద్ధంలో మన సైన్యం పాత్రకు, మన వీర సైనికుల ధైర్యానికి గర్వకారణంగా నిలుస్తుందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement