రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని కుచేయిపొదొరో గ్రామ సమీపంలొ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పనొబొంధా గ్రామానికి చెందిన సహదేవ్ కుంభార్‌గా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామం నుండి టికిరి వెళుతుండగా కుచేయిపొదొరొ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై పడిపోవడంతో తల వెనుకభాగం తీవ్రంగా గాయపడింది. అటువైపుగా వెళుతున్న కొందరు ఆంబులెన్స్‌కు సమాచారం అందించి టికిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు . సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండిచా ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ
భువనేశ్వర్: శ్రీమందిరం పాలక మండలి సభ్యులు శ్రీగుండిచా ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఆలయంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఈ బృందం పర్యవేక్షించింది. పాలక మండలి సభ్యులు, శ్రీమందిరం సీనియర్ అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. నాట్య మండపంలో ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఏర్పాటును తనిఖీ చేశారు. పనులన్నీ నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని నొక్కి చెప్పారు.


