రాయగడ: ప్రముఖ కవి, రచయిత జయదేవ్ శెఠి స్వియ కవితా సంకలనం ‘నేనే త్రివర్ణ పతాకాన్ని’ పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలోని మా మాంగళ మందిరం ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు బాదల్ కుమార్ థా, జోగేశ్వర్ దాస్, కలహండి జిల్లా శాఖ ధర్మ జాగరణ సమన్వయకర్త పర్వత్ కుమార్ మహాపాత్రో, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జితేంద్ర కుమార్ రథ్, మా మంగళ మందిరం పరిశీలన కమిటీ అధ్యక్షులు రాజు సాహు తదితరులు పాల్గొన్నారు.
సంకలనంలో 37 కవితలు ఉన్నట్లు రచయిత, జయదేవ్ శెఠి వెల్లడించారు. ప్రతీ కవిత దేశభక్తిని చాటుతూ జాతీయ ఆలోచనలు, భావాలనుచాటి చెప్పేవిధంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ. దేశ భక్తిని చాటే ఇటువంటి తరహా కవితలు యువతకు ఎంతో అవసరమని అన్నారు.


