గ్యాస్‌ కొరతతో హోటళ్ల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతతో హోటళ్ల బంద్‌

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

పర్లాకిమిడి: పట్టణంలో గ్యాస్‌ కొరత కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీ, భారత్‌గ్యాస్‌ కంపెనీలకు శుక్రవరాం రెండు ట్రక్కుల గ్యాస్‌ సిలిండర్ల స్టాక్‌ వచ్చింది. నలభైరోజులకు గ్యాస్‌ కార్డుపై ఒక సిలిండర్‌ను వివిధ గ్యాస్‌ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల స్టాకు రాకపోవడంతో పట్టణంలో అనేక హోటళ్లు, తోపుడు బండ్ల టిఫిన్‌ సెంటర్లు మూతబడ్డాయి. దీంతో కొందరు చిరు వ్యాపారులు ఇదే అదనుగా ఎక్కువ ధరకు బ్లాకులో గ్యాస్‌ సిలిండర్లు రూ.రెండు వేలు, రూ.2500 అమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని హోటళ్లలో జీడి తోక్కుతో వంటలు చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలా హోటళ్లలో ఇడ్లీ, వడ వంటి టిఫిన్లుకు రేట్లు పెంచారు. ఈ విషయమై గ్యాస్‌ కంపెనీలకు అడగ్గా.. ప్రస్తుతం 45 రోజులకు వంట గ్యాసును సరఫరా చేస్తున్నామని, బ్లాకులో అమ్మేవారు రేపొద్దున్న గ్యాస్‌ సిలిండరు దొరక్క అనేక బాధలు పడుతూ రూ.2వేలు, రూ.2,500 ధరకు కొనాల్సి వస్తుందని గ్యాస్‌ కంపెనీల యజమాని దేవేందర్‌ సాహు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement