జయపురం: జయపురం సబ్‌డివిజన కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియ కౌన్సిల్(ఎన్‌ఏసీ) కార్యాలయంలో జన గణనపపై మూడు రోజుల శిక్షణ శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జనగణన ఇన్‌చార్జి, కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కార్యనిర్వాహక అధికారి కమలేశు మహంతి, ఎన్‌ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఫీల్డ్ ట్రైనర్ దుర్గాప్రసాద్ నాయక్ పర్యవేక్షణలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు స్వాగతం పలికి ప్రతిజ్ఞ చేయించారు. 50 మంది ఉపాధ్యాయులు, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. వారికి జనాభాను లెక్కించే విధానంపై ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. జిల్లా జనగణన బాధ్యతల పర్యవేక్షకులు కె.గుణవర్ధన్ శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు. జనగణన 2027 కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమనిరేషన్, ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ నిర్వహణ ఉంటుందన్నారు. రెండవ విడత జనగణన కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో ఉంటుందన్నారు. నిబంధల ప్రకారం పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. 2011లో జనాభా లెక్కులు జరిగాయని.. తరువాత 2021లో చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ జరగలేదు.


