జాబ్‌మేళాకు స్పందన | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు స్పందన

Mar 25 2026 7:32 AM | Updated on Mar 25 2026 7:32 AM

సోంపేట: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి.చంద్రమౌళి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని కె.ఆర్‌.కళాశాలలో మంగళవారం జాబ్‌ మేళా నిర్వహించారు. 13 ప్రెవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై 256 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 105 మందిని వివిద కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్‌మెంట్‌ అధికారి ఎం.వంశీకృష్ణ, కళాశాల కరస్పాండెంట్‌ కొంచాడ శేషాద్రి, ప్రిన్సిపాల్‌ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement