ఉద్యోగులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు శిక్షణ

Mar 25 2026 7:32 AM | Updated on Mar 25 2026 7:32 AM

పర్లాకిమిడి: ప్రభుత్వ కార్యాలయాల్లో ఒడియా భాషలో ప్రత్యుత్తరాలు రాయాలని కోరుతూ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని అదనపు జిల్లా మాజిస్ట్రేట్‌ (రెవెన్యూ) మునీంద్ర హానంగా మంగళవారం కలెక్టరేట్‌ హాల్‌లో ప్రారంభించారు. ఈ శిబిరంలో జిల్లాలోని ప్రభుత్వ అడ్మిన్‌స్ట్రేటివ్‌ సిబ్బంది ఒడియా భాషలో ఎలా ప్రత్యుత్తరాలు ఎలా రాయాలో ఒడియా భాషా వ్యవహార ప్రతిష్టాన్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ శంకర పాడీ వివరించారు. ఈ శిబిరంలో ఒడియా భాష పండితులు, భువనేశ్వర్‌ డాక్టర్‌ రబినారాయణ పండా, శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల (ఒడియా విభాగం) డాక్టర్‌ రమేష్‌ చంద్ర మల్లిక్‌, సాహిత్యకారులు పూర్ణచంద్ర ప్రధాన్‌ పాల్గొని పలు అంశాలను వివరించారు. ఇంగ్లిష్‌ నుంచి ఒడియా భాషకు తర్జుమా, ఒడియా శబ్ధకోశం, గ్రామర్‌, తదితర అంశాలను తెలియజేశారు. ఒడియా భాష, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ శిబిరానికి జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement