శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు

Mar 25 2026 7:18 AM | Updated on Mar 25 2026 7:18 AM

జయపురం: జయపురంలో శ్రీరామ నవమి ఉత్సావాలను వైభవంగా నిర్వహించేందుక కమిటీ సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఉత్సవ కమిటీలకు, ప్రజలకు ఆహ్వాన పత్రాలను మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభించారు. జయపురం సనాతని ఏకతా యాత్ర, గురు రెస్పెక్ట్‌ ఆహ్వాన్‌ అభిజాన్‌ 2026ను శ్రీరామ నిర్వాహక కమిటీ నిర్వహించింది. ఆ కమిటీ కార్యకర్తలు శ్రీరామ భక్తులు బెనాసూర్‌, ముండాగుడ, రనస్పూర్‌, బిసింగపూర్‌, కుములి, భుమక్తపొదర్‌, చారుముల్ల, నారిగాం, గుమడ,బొడిగాం, కమత, బొరిగుమ్మ గ్రామాల్లో పర్యటించి గ్రామ పెద్దలను కలిసి ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చందాలను వసూలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement