పర్లాకిమిడి: గజపతి జిల్లాలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పదోవార్డుకి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నరేష్‌కుమార్ సాహు, 13వ వార్డుకు చెందిన అట్టాడ వాసు, గుమ్మా బ్లాక్ ఝమ్మి గ్రామానికి చెందిన దనాన దామోదర్‌లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా కొత్త బస్టాండు నుంచి ఖంజావీధి పార్టీ కార్యాలయం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ బీజేపీ శ్రేణులు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షులు నబ కిశోర్‌శోబోర్ ఆధ్వర్యంలో జరిగిన మిశ్రణపర్వ్ సభలో నరేష్‌కుమార్, దామోదర్, వాసులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు.


