కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంరక్షణ చర్యలు అధికార యంత్రాంగం పరిశీలించింది. శనివారం నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అత్యవసరంగా ఈ పర్యటన నిర్వహించారు. కటక్‌లోని ఎస్‌ఈబీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా ఈ పర్యటన జరిగింది. కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నేతృత్వంలోని బృందం ఆస్పత్రిలో వివిధ విభాగాలు పరిశీలించారు. వివిధ బ్లాకుల్లో అగ్ని ప్రమాదం ఏర్పడితే తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై క్షేత్ర పర్యటనలో తెలుసుకున్నారు. కొన్నిచోట్ల లోపాలను సరిదిద్దాలని ఎమ్మెల్యే గౌరీ అధికారులను సూచించారు. అనంతరం సమీక్ష సమావేశం జరిగింది.


