బొబ్బిలి: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి పరిపాలనను సమర్థవంతంగా చేపట్టనున్నట్టు మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ జె.వి.వి.ఎస్.రామమోహనరావు తెలిపా రు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శని వారం ఆయన బాధ్య తలు స్వీకరించారు. ము న్సిపాలిటీలోని 31 వార్డులూ అభివృద్ధి పథంలో పయనించేలా కలెక్టర్ ఆదేశాలు పాటిస్తూ పని చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇంటిపన్ను చెల్లించాల్సిందే..
రాజాం: ప్రజలు బకాయిపడిన తమ ఇంటిపన్నును తప్పక చెల్లించాల్సిం దేనని డిప్యూటీ ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు అన్నారు.కంచరాం గ్రామంలో ఇంటిపన్ను వసూళ్లను శనివారం పరిశీలించారు. ఆ పంచాయతీలో అధికంగా ఇంటిపన్ను బకాయిపడినవారితో మాట్లాడి స కాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు.
అన్నదానం
రాజాం: మండలంలోని అంతకాపల్లి గ్రామంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శనివారం అన్నదానం నిర్వహించారు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన టంకాల యల్లంనాయుడు కుటుంబీకులు 2 వేల మందికి అన్నసంతర్పణ చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.ఆలయ ఇన్‌స్పెక్టర్ కె.వి.రమణ పాల్గొన్నారు.
రామాలయ నిర్మాణానికి భూమిపూజ
సంతకవిటి: మండలంలోని పోతురాజుపేట గ్రామంలో రామాలయం నిర్మాణానికి గ్రామస్తులు శనివారం భూమిపూజ చేశారు.ముందుగా మహిళలు కలశాలతో గ్రామప్రదక్షిణ చేశారు.అనంతరం రామాలయ నిర్మాణ స్థలం వద్ద పురోహితులు పూజలు చేశారు. గ్రామపెద్దలతో పాటు ఉత్తరాంధ్ర సాదుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పాల్గొన్నారు.
వడ్డీ రాయితీని
వినియోగించుకోండి
బొబ్బిలి: పట్టణ ప్రజలు ఇళ్లు,నివాస స్థలాల పన్నులను వెంటనే చెల్లించి ప్రస్తుతం ప్రకటించిన వడ్డీలో 50శాతం రాయితీని వినియో గించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. శనివారం ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి పలు వార్డులు, బజారులోని వాణిజ్య స్థలాలకు వెళ్లి దాదాపు రూ.2 లక్షల పన్ను వసూలు చేశారు. ఈ నెలాఖరులోగా శతశాతం వసూళ్లు చేపట్టేం దుకు ఏరియాల వారీగా సిబ్బందిని నియమించారు.
గజపతినగరం పరిశీలకుడిగా జగన్‌మోహన్‌రావు
సంతకవిటి: శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సిరిపురపు జగన్‌మోహన్‌రావును గజపతినగరం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా పార్టీ అధి ష్టానం నియమించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు.


