అడవులను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

అడవులను సంరక్షించాలి

Mar 22 2026 2:03 AM | Updated on Mar 22 2026 2:03 AM

లేదంటే మానవ మనుగడ కష్టమే

ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి

ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

పర్లాకిమిడి: ప్రకృతికి వ్యతిరేకంగా మనం నడుచుకుని అడవులు ధ్వంసం చేయడం వల్లే ఇప్పుడు వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి అన్నారు. ప్రతిఒక్కరూ ఒక్కో మొక్కను నాటడంతోపాటు అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పర్లాకిమిడి ఫారెస్టు డివిజన్‌ డీఎఫ్‌వో కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం నిర్వహించగా.. ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో గౌరవ అతిథిగా జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్‌ సమితి చైర్మన్‌ బల్ల శాయమ్మ, డీఎఫ్‌వో కె.నాగరాజు, ఏసీఎఫ్‌ అరున్‌ కుమార్‌ సాహు, ఏసీఎఫ్‌ శైనీశ్రీ దాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనగర్‌ సమితి చైర్మన్‌ శాయమ్మ మాట్లాడుతూ..కాశీనగర్‌ వంశధార పరీవాహక ప్రాంతాలైన వన్న, గౌరి, పురుటిగూడ తదితర పన్నెండు గ్రామాల్లో నాలుగేళ్లుగా అటవీ ఏనుగులు పంటలొలాలు నాశనం చేస్తున్నాయన్నారు. దీనికి అటవీ అధికారులు తగు పరిష్కారం చూపాలన్నారు.

ఏనుగుల వల్ల కలిగిన పంట నష్టం రూ. 10 వేల నుంచి 20 వేల రూపాయలకు పెంచాలని కోరారు. ఏనుగులు కాశీనగర్‌ ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతున్నా ప్రజలు ఎటువంటి హాని తలపెట్టడం లేదని అయితే రాత్రయితే కరెంటు కోత విధిస్తున్నారని జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కాశీనగర్‌ బ్లాక్‌లో 22 సోలార్‌ లైట్లను శియ్యాళి పంచాయతీ సర్పంచ్‌ రాంప్రసాద్‌ పట్నాయక్‌, పురుటిగుడ మాజీ సమితి సభ్యులు రోక్కం సతీష్‌, బాబూరావులకు డీఎఫ్‌వో అందజేశారు. గజపతి జిల్లాలోని మోహానా అటవీ డివిజన్‌ అధికారి లక్ష్మీకాంత బిశోయి, రామగిరి రేంజ్‌ అధికారి పీయూస్‌ పట్నాయక్‌, దేవగిరి ఫారెస్టర్‌ వెంకటరమణ, ప్రసాద్‌ నాయక్‌లకు మెమెంటోలు, ప్రశంపాపత్రాలతో సత్కరించారు. అటవీశాఖ, ఎకానమీపై ప్రసంగించిన విద్యార్థులకు ఎమ్మెల్యే రూపేష్‌పాణిగ్రాహి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏసీఎఫ్‌. అరుణ్‌ కుమార్‌ సాహు అతిథులకు ధన్యవాదాలు తెలియజేశారు.

మొక్కలతోనే మానవమనుగ

జయపురం: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని వక్తలుఅన్నారు. జయపురం అటవీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీజగత్‌ జననీ మందిరం కూడలి నుంచి విక్రమ దేవ్‌ ఉన్నత మాధ్యమిక పాఠశాల వరకు ఆవగాహన ర్యాలీ చేశారు. ర్యాలీలో నర్సింగ్‌ విద్యార్థినులు, హెల్త్‌ వర్కర్లు, అటవీ విభాగ సిబ్బంది ప్లకార్డులతో పాల్గొన్నారు. పాల్గున్నారు. జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారిణి అర్చితా మిత్తల్‌, అటవీ విభాగ అధికారి ప్రతాప్‌ చంధ్ర బెహర పచ్చ జెండాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement