బొబ్బిలి: అవాంఛనీయ సంఘటనలు,దొంగతనాలు, జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బొబ్బిలి పట్టణంతో పాటు మండలంలోని పలు కూడళ్లు, కళాశాలలు, వసతి గృహాలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరం రాత్రి వేళ గస్తీ కాస్తున్నామని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు తెలిపా రు.శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కేవలం ఎస్‌ఐలు, సిబ్బంది మాత్రమే కాకుండా తానూ రాత్రి 12 గంటల వరకు గస్తీ నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. నిత్యం నైట్ రౌండ్లు తప్పనిసరి చేయడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఇటీవల చర్చి సెంటర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎమ్ నుంచి నగదు బయటకు వచ్చి ఉండడాన్ని నైట్ రౌండ్స్‌లో ఉన్న సిబ్బంది గుర్తించి సమాచార మందించగా, ఏఎస్‌ఐ కొండలరావును పంపించడంతో పాటు ఎస్‌బీఐ సిబ్బందికి తెలియజేసి నగదును ఏటీఎం థర్డ్‌పార్టీ ఏజెన్సీ నిర్వాహకులకు అందజేశామని తెలిపారు. రాత్రివేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తుండ డం వల్ల దొంగతనాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. కళాశాలలు, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో సిబ్బందికి షిఫ్ట్‌ల వారీగా డ్యూటీలు వేస్తున్నామని వివరించారు. గంజాయి,డ్రగ్స్,మద్యం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.


