రాయగడ: ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్‌కలెక్టర్ రమేష్ కుమార్‌నాయక్, జిల్లా సంస్కృతి విభాగం అధికారి సుచిత్ర బౌరి, సీనియర్ సిటిజన్లు, పట్టణ ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో ఉన్న వరపుత్రులు విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా జిల్లా పౌరసంబంధాల శాఖ ప్రచారం చేయాలని నిర్ణయించారు.


