కొరాపుట్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి చెందిన షర్మిష్టాదేవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్న షర్మిష్ట గతంలో పార్టీ జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వహించారు. ఈమె నియామకం పట్ల నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు అభినందనలు తెలియజేశారు.
ఘనంగా జయపురం
రాజమాత జన్మదిన వేడుకలు
జయపురం: జయపురం రాజమాత మహారాణి సారిక దేవి 56వ జన్మదిన వేడుకలు స్థానిక రాజమహల్‌లో శనివారం ఘనంగా జరిగాయి. రాజమహల్ దర్బారు హాలులో మహారాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. రాజ సేవకులు ఛత్రం పట్టి వింజారామాలతో మహారాణి వెంట బయటకు వచ్చారు. ప్రజలు పూలు చల్లి మహారాణికి శుభాకాంక్షలు తెలియజేశారు.


