మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.90 గ్రామం వద్ద ఉన్న గొప్పబంధు మాధ్యమిక పాఠశాల విద్యార్థులు శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కలిమెల సమితిలో కమ్యునిటీ హెల్త్ సెంటర్ ఔషధ వృక్షవాటిక, దాని పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. కార్యక్రమానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ దీనబంధు మహానందియా హాజరై మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు మనిషి జీవితాన్ని సార్థకం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హిమాన్షు శేఖర్ వైద్య, ఇతర ఉపాధ్యాయులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


