ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికలు పలు సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు ఆజ్యం పోస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంమంది సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో వారిపై చర్యలకు ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నడుం బిగించింది. ఈ దిశలో ఇద్దరు ఎమ్మెల్యేల పదవుల రద్దు కోరుతు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా అభ్యర్థించింది. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ సి.ఎస్‌.రాజెన్‌ ఎక్కా స్పీకర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పిటిషనులో సభ్యుల పదవుల రద్దుకు సంబంధించిన బలమైన ఆధారాలు, కారణాలు వివరించారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ (ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద సోఫియా ఫిర్దౌస్‌ (బారాబటి కటక్‌), దాశరథి గొమాంగో (మోహన)లను అనర్హులుగా ప్రకటించాలని వినతులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement