జయపురం: స్థానిక యాదవ భవనంలో ఉత్కళ సమ్మిళిని కొరాపుట్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉత్కళ దినోత్సవాల సన్నాహక కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయిక్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఉత్కళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఉత్కళ సమ్మిళిని జిల్లా కార్యదర్శి నవీన్ మదల మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఉత్కళ దినోత్సవాలు రాజనగర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్వతంత్ర ఉత్కళ ప్రదేశ్ నిర్మాణానికి కృషి చేసిన ప్రముఖుల విగ్రహాలకు ఉత్కళ దినోత్సవం రోజున నివాళులర్పించాలని.. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రాజనగర్ కూడలి వద్ద సాధారణ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ సుదర్షన గౌడ, కవిరాజ్ పరమేశ్వర పాత్రో, బాలారాయ్, మీన కేతన పరచ, చంద్రకాంత సుతార్, సత్యనారాయణ పరిచ, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ నవమి సన్నాహక సమావేశం
జయపురం: పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సభాగృహంలో శ్రీరామ నవమి వేడుకల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎప్పటిలాగే అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని భారీ రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను పట్టణ పోలీసులకు అప్పగించారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, రెండు అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. అలాగే అత్యవసర సేవల కోసం రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య విభాగ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మద్యం దుకాణాలపై ఎకై ్సజ్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి, తహసీల్దార్ సవ్యసాచి జెన, అదనపు పోలీసు అధికారి అభిషేక్ పాణిగ్రహి, ప్రొబెషనరీ పోలీసు అధికారి వి.రామసదన్, సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్, అగ్నిమాపక విభాగ అధికారి సురేష్ కుమార్ బారిక్ తదితరులు పాల్గొన్నారు.


