పోలీసు అధికారులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులకు సత్కారం

Mar 21 2026 4:54 AM | Updated on Mar 21 2026 4:54 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి క్షేత్రాలను గుర్తించి అరికట్టడం, గంజాయి అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసు అధికారులను ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా శుక్రవారం ఒడిశా పోలీసు భవన్‌లో సత్కరించారు. మెమెంటోలు, పురస్కారం అందుకున్న వారిలో జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, చంద్రగిరి ఎస్సైలు సునీల్‌ శెఠి, పంకజ్‌ దాస్‌, సందీప్‌ హేంబ్రమ్‌ ఉన్నారు. గజపతి జిల్లాలో పోలీసులు ఆర్‌.ఉదయగిరి, మోహానా, ఆడవలో 2025లో 750 ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయగా 168 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement