నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు

Nov 14 2025 9:01 AM | Updated on Nov 14 2025 9:01 AM

నేడు

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు

● కలెక్టర్‌ మధుసూదన్‌ దాస్‌ వెల్లడి

● కలెక్టర్‌ మధుసూదన్‌ దాస్‌ వెల్లడి

భువనేశ్వర్‌: నువాపడా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్లను శుక్రవారం లెక్కించనున్నట్టు కలెక్టర్‌ మధుసూదర్‌ దాస్‌ గురువారం తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎం లెక్కింపు జరుగుతుందని చెప్పారు.

మూడంచెల భద్రత

నువాపడా నేషనల్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రాంగణంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం లోపల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌,) పోలీసు దళాలు మోహరిస్తారు. మొత్తం 14 టేబుళ్ల వద్ద 26 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌, ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు.

కలప స్వాధీనం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి పరిధిలో ఉన్న యంవి 24 గ్రామంలో బుధవారం రాత్రి మల్కన్‌గిరి, చిత్రకొండ, మోటు, బలిమెల ప్రాంతాల అటవీశాఖ సిబ్బంది దాడి చేశారు. 61 చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. వ్యాపారం కోసం కలను నిల్వ చేశారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. నిందితులను గురువారం వైద్య పరీక్షలు, విచరణ పూర్తి చేసి కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. వీరిలో ముఖ్య నిందితులు సురాజ్‌ మండాల్‌ యంపివి 47 గ్రామ వాసి, జయంతో బచ్చడ్‌గా తేలింది. వీరితోపాటు మారో ఇద్దరు సహాయకులపై కూడా కేసు నమోదు చేశారు.

విలేకరి మృతికి సంతాపం

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కాశీనగర్‌కు చెందిన ఒడిశా యూనియన్‌ ఆఫ్‌ జర్నిలిస్టు సభ్యుడు తామాడ కృష్ణారావు (49) గురువారం ఉదయం తన స్వగృహాంలో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఒడియా దినపత్రిక ధరిత్రిలో కొంత కాలంగా పని చేస్తున్నారు. ఆయన మృతికి పర్లాకిమిడి ప్రెస్‌ క్లబ్‌లో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి

రాయగడ : గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారి, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యమివ్వాలని బిసంకటక్‌ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. గురువారం సమితి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, పంచాయతీ స్థాయిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదని పలువురు సర్పంచులు సమావేశంలో ప్రస్తావించారు. సమితి బీడీఓ శివప్రసాద్‌ పట్నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు దేవీప్రసాద్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడికి ఆరు నెలలు జైలుశిక్ష

పర్లాకిమిడి: పర్లాకిమిడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వనదుర్గా మందిరంలో ఈ ఏడాది జూన్‌ 24న చోరీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి గురువారం జేఎంఎఫ్‌సీ.కోర్టులో జడ్జి సత్యజిత్‌ పాణి నిందితుడికి ఆరునెలలు జైలుశిక్ష, రూ.500 రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడు పి.ప్రసాద్‌రావు ఈ ఏడాది జూన్‌ 24న ఉదయం 11 గంటల సమయంలో పూజారీ బట్టలు మార్చుకుని వెళ్లిపోతున్న సమయంలో వనదుర్గా మందిరంలోకి ప్రవేశించి అమ్మవారి వస్తువులు, చీరలో మూటకట్టుకుని పారిపోతుండగా స్థానికులు వెంటబడి పట్టుకున్నారు. నిందితుడ్ని స్థానిక ఆదర్శ పోలీస్టేషన్‌లో అప్పగించారు. ఈ కేసులో ఎనిమిది మంది సాక్షులను జడ్జి విచారించిన పిమ్మట నిందితుడుపై ఐపీసీ సెక్షన్‌ 305 కిం్ద నేరం పరిగణింపబడి ఆరునెలలు జైలు శిక్ష, రూ.500 జరిమాణా విధించారు. ఈకేసు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎల్‌.సంజయ్‌ వాదించగా, కేసును ఇన్‌చార్జి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా పర్యవేక్షించారు.

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు 1
1/3

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు 2
2/3

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు 3
3/3

నేడు నువాపడా ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement