85 తాబేళ్లు పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మాల్లవరం పంచాయతీ అనంతపల్లి గ్రామంలో తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు కలిమెల అటవీశాఖ బుధవారం రాత్రి సమాచారం అందింది. కలిమెల ఫారెస్టు గార్డ్ పార్థసారధి రౌతు, ఇతర సిబ్బంది, మోటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పూజరి గురువారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని రహదారిపై తాబేళ్లు అమ్ముతున్న వ్యాపారిని పట్టుకున్నారు. అతనితో ఉన్న మారో ఇద్దరు నిందితుల కూడా అరేస్టు చేశారు. తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎం.వి 79 గ్రామం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. మొత్తం 85 తాబేళ్లు వున్నాయి. వాటిలో 39 మృతి చెందాయి. నిందితులను విచారింగా ప్రాణ్ గోపాల్ దాస్ అనే వ్యక్తి ఈ వ్యాపారం చేస్తున్నాడు. అతని సహాయుకులు హరధర్ మండల్, సుధాంసు పాల్‌పై కేసు నమోదు చేసి, ఎం.వి 79 పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ చంద్రకాంత్ తండా తెలిపారు. తాబేళ్లను పశు వైద్యశాలలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం శభరి నదీలో విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.


