సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!
కొరాపుట్: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బొరిగుమ్మలో అదృశ్యమయ్యాడు. విశాఖపట్నంలో మృతదేహం లభిచండంతో అందరినీ ఉలిక్కిపాటుకి గురిచేసింది. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మకి చెందిన కిల్లంశెట్టి శెట్టి వినోద్ (40) మృతదేహం గురువారం విశాఖపట్నంలోని కై లాష్ గిరి వద్ద సముద్రంలో పోలీసులు గుర్తించారు. మృత దేహానికి సమీపంలో అతను వీనియెగించిన కారును గుర్తించారు. కారులో ఉన్న అతని దుస్తులు, ఇతర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్‌కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సమాచారం బొరిగుమ్మలోని వినోద్ కుటుంబం అందించారు. వెంటనే అతని భార్య అనిత, కుటుంబ సభ్యులు విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.
ఉలిక్కిపడ్డ వ్యాపార వర్గాలు..
కొరాపుట్ జిల్లా బొరిగుమ్మకి చెందిన కిల్లంశెట్టి గోవిందరావు కుమారుడు వినోద్. వీరికి బొరిగుమ్మలో తరతరాలు ఆస్తులు ఉన్నాయి. వినోద్ హైదరాబద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇతనికి జయపూర్‌కి చెందిన శిల్లా లక్ష్మణరావు కుమార్దె అనితతో వివాహమైంది. అనిత కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వీరికి 8 ఏళ్ల అన్విన్ (కుమారుడు) ఉన్నాడు.
నాలుగు రోజుల క్రితమే వచ్చి..
వినోద్ తన కుటుంబంతో నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి స్వస్థలం బొరిగుమ్మలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. రాయగడ మజ్జి గౌరీదేవాలయం, గుప్తేశ్వర క్షేత్రం, జయపూర్‌లో అత్తారింటికి వెళ్లి కుటుంబంతో 11వ తేదీ రాత్రి బొరిగుమ్మ చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లమని చెప్పి తాను కారు పార్కింగ్ చేసుకొని వస్తానని వెళ్లాడు. అలా వెళ్లిన వినోద్ చాలా సేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వచ్చి పరిశీలించారు. కారుతో పాటు వినోద్ కనిపించలేదు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యంకాకపోవడంతో బొరిగుమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం విశాఖలో గాలిస్తున్న అతని బంధువులకు కారు కనిపించింది. కొద్దిసేపటికే మృతదేహాన్ని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
ఇలా ఎలా...
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వినోద్ తన కుటుంబాన్ని బొరిగుమ్మలో వదలేయడంతో అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థికంగా బలంగా ఉండి, ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం పట్ల మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విదంగా ఆత్మహత్య చేసుకోవాలంటే సుమారు 250 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి ఆత్మహత్య చేసుకుంటాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వినోద్ మృతదేహంపై దుస్తులు లేక పోవడం, అవి కారులో లభ్యం కావడం కూడా మిస్టరీగానే ఉన్నాయి. ఈ ఘటన అవిభక్త కొరాపుట్ జిల్లాలో వర్తక, వ్యాపర వర్గాలతోపాటు తెలుగు ప్రజల్లో సంచలనం కలిగించింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..!


