విద్యార్థులకు డిబేట్ పోటీలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాలలో జిల్లా సమాచారశాఖ, మల్కన్‌గిరి యునియాన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నేషనేల్ ప్రెస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని సైనిక్ స్కూల్, కళాశాల విద్యార్థులకు డిబేట్ పోటీలు గురువారం నిర్వహించారు. వీరిలో విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను 16వ తేదీన మల్కన్‌గిరి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే వేడుకుల్లో బహుమతులు అందజేస్తారు. పోటీల్లో ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, మహిళా కళాశాల, ఏకలావ్య పాఠశాల, ఐఎంఎస్‌టీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథులుగా డీఐపీఆర్ ప్రమిళ మాఝి, కళాశాల సిబ్బంది, సినియర్ జర్నలిస్టు శివప్రసాద్ కీర్తనీయా హాజరయ్యారు.
విద్యార్థులకు డిబేట్ పోటీలు


