అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల ఎన్‌ఎస్‌ఐ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ సమీక్షించారు. అభివృద్ధి పనులు సమితిలో ఏలా జరుగుతున్నాయో సమితి అధికారి అమూల్యా కుమార్ సాహును అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎన్‌ఎస్‌ఐ కార్యాలయాన్ని సందర్శించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కొత్తగా ఎన్‌ఎస్‌ఐ కార్యాలయ భవనం, పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి అంశాలపై బలిమెల పౌరపరిషత్ చైర్మన్ ప్రదీప్ కుమార్ నాయక్‌తో చర్చించారు. ఒక ఎన్‌పోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసి బలిమెలలో రహదారి పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను రోజువారీ మార్కెట్ ఉన్న దుకాణాలకు తరలించే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బలిమెల ఆరోగ్య కేంద్రం కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఓ కాంప్లెక్స్‌ను నిర్మించి దిగువ మార్కెట్ కాంప్లెక్స్, పైఅంతస్తులో సీనిమా హాల్ నిర్మించాలని ప్రతిపాదన చేశారు.


