283 కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు 283 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సునాబెడా వైపు మాచ్‌ఖండ్ నుంచి గంజాయి వస్తుందని సమాచారం వచ్చింది. దీంతో ఇన్‌స్పెక్టర్ చరణ్ సింగ్ మజ్జి నేతృత్వంలో పోలీసులు సన బొడింగా వద్ద తనిఖీలు చేపట్టారు. అదే ప్రాంతంలో ఓఆర్ 02 ఏఎల్ 0801 నంబర్ గల సుజుకీ డిజైర్ కారు కనిపించింది. ఆ కారులో వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో తనిఖీలు చేపట్టడంతో గంజాయి పట్టు బడింది. దీంతో గంజాయిని సీజ్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
10 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి మోక్కా పంచాయతీ కలియగూడ గ్రామంలో 10 అడుగుల కొండచిలువ పామును శనివారం పట్టుకున్నారు. గ్రామానికి చెందిన త్రినాఽథ్ బుమియా, గంగాధర్ నాయక్ ఇద్దరు కలిసి వరి పొలంలో కలుపు తీస్తుండగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో ధైర్యంతో దాన్ని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చి మత్తిలి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని స్వాధీనం చేసుకున్నారు.
సినీనటుడు అశ్రుమోచన్ మహంతికి తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర నటుడు అశ్రుమోచన్ మహంతి నడుపుతున్న కారు శనివారం తెల్లవారు జామున భువనేశ్వర్ శివార్లలోని కొలాఝొరి సమీపంలోని దయా పడమ కాలువలోకి అదుపు తప్పి పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం నటుడు సురక్షితంగా బయటపడగలిగాడు. కారు ముందుకు అకస్మాత్తుగా వచ్చిన వీధి కుక్కను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి నటుడిని వాహనం నుంచి బయటకు తీయడానికి సహాయం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలువలో నీరు తక్కువగా ఉన్నందున ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తున్న అశ్రుమోచన్ మహంతికి స్వల్ప గాయాలు అయ్యాయని ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి ఎంకే రాయ్ తహసీల్ పరిధిలో ఉన్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.స్నేహలత 26 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇందులో సిలిమి మౌజా పరిధిలో ఉన్న 14 మందికి, కొదప పంచాయతీలోని పరికుపడ గ్రామానికి చెందిన మరో 12 మందికి పట్టాలను అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కవితా బిడిక, సూపర్‌వైజర్ మనోజ్ సబర్ పాల్గొన్నారు.
283 కిలోల గంజాయి స్వాధీనం
283 కిలోల గంజాయి స్వాధీనం
283 కిలోల గంజాయి స్వాధీనం


