ఆడంబరంగా వల్లభాయ్ జయంతి ముగింపు వేడుకలు
పర్లాకిమిడి:
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి వేడుకల్లో భాగంగా ఏక్తా పాదయాత్రను బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి గజపతి స్టేడియంలో ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని విద్యార్థులంతా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ముగింపు సమావేశంలో కలెక్టర్ మధుమిత, మోహన ఎమ్మెల్యే దాశరతి గోమాంగో, జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి ఎం.ప్రకాశ రావు, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతి స్టేడియంలో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి మిల్లెట్స్ స్టాల్స్‌ను ప్రారంభించారు. అనంతరం సర్దార్ వల్లభాయి పటేల్, ఏక్తా పాదయాత్రపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్టేడియంలో ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ఏక్ పేడ్ మా కా నామ్ పేరిట మొక్కలను నాటారు.
ఆడంబరంగా వల్లభాయ్ జయంతి ముగింపు వేడుకలు
ఆడంబరంగా వల్లభాయ్ జయంతి ముగింపు వేడుకలు
ఆడంబరంగా వల్లభాయ్ జయంతి ముగింపు వేడుకలు


