అభివృద్ధి పనుల పరిశీలన
పర్లాకిమిడి: ఈస్టుకోస్టు రైల్వే, వాల్తేరు డివిజన్ డి.ఆర్.ఎం లలిత్ బోరా విశాఖపట్నం–గుణుపురం ప్యాసింజరులో అకస్మికంగా విచ్చేసి అమృత్ భారత్ రైల్వేష్టేషన్ల ఆధునికీకరణ పనులను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ బయట ఆరెంజ్, నీలం రంగులను మార్చడం చూశారు. స్టేషన్ ఎంట్రన్స్‌లో తారు రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ష్టేషన్ వెలుపల కోణార్కు ఆర్చి వద్ద విలేకరులతో మాట్లాడారు. అమృత భారత్ రైల్వే ష్టేషన్ పనులను పర్యవేక్షించడానికి వచ్చానని, త్వరితగతిన ఈ పనులకు పూర్తిచేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. పర్లాకిమిడి గుణుపురం బ్రాడ్ గ్యాజ్ లైన్ రాయగడ వద్ద తెరువల్లికి పొడిగించేందుకు కూడా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం 3 స్టేషన్ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని, రైళ్ల వేగం పెంచితే గానీ, కొత్త రైళ్లను ఈ లైనులో వేయలేమన్నారు. సీనియర్ డివిజనల్ ఇంజినీర్ బి.సాయిరాజు, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్, సీనియర్ డీఓఎం అవినాష్, పీఆర్‌ఓ జయరాం ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అభివృద్ధి పనుల పరిశీలన


