ప్రథమ చికిత్స
ఆర్టీసీకి కావాలి..
శ్రీకాకుళం–పాతపట్నం ఆర్డీనరీ బస్సులో ఖాళీగా ఉన్న బాక్సు
మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో 25 రకాల మెడికల్ కిట్లు అందుబాటులో ఉండా లి. యాంటీ సెప్టిక్ క్రీమ్, లిక్విడ్, ప్యా డ్లు, గాయాలపై అంటించేందుకు స్టెరిలైజ్డ్ ఎలాస్టిక్ బాండ్, వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్, అయోడిన్, దూది, నొప్పి నివారణ మాత్రలు, చేతి గ్లవ్స్, శానిటైజర్ తదితర మెడికల్ వస్తువులు తప్పనిసరి గా ఉంచాలి. వీటితో పాటు ప్రథమ చికిత్స ఎలా చే యాలో డ్రైవర్, కండక్టర్లకు అవగాహన కల్పించాలి
ఆస్పత్రులకు పరుగుతీయాల్సిందే..
జిల్లాలో శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో సుమారు 360కు పైగా బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ సుమారు 45 వేలకు పైగా ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా బస్సు ల్లో ప్రయాణం చేస్తున్నపుడు మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ప్రథమ చికిత్స పెట్టెలు అలంకార ప్రాయంగా మారడంతో వెంటనే సమీప ఆస్పత్రులకు పరుగు లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బస్సుల్లో పూర్తిస్థాయిలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాల ని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రథమ చికిత్స
ప్రథమ చికిత్స
ప్రథమ చికిత్స


