సైబర్ సెక్యూరిటీపై అవగాహన
బలిమెల కళాశాలలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి బలిమెల పట్టణంలోని బలిమెల సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. మా గౌరవం–మా కాలేజ్ అనే కార్యక్రమంలో భాగంగా శిబిరాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్ల మోసపూరిత పద్ధతులు, ఆన్‌లైన్ మోసాలు, లాటరీ మోసం, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, నకిలీ కాల్స్ ద్వారా ఓటీపీ అడగడం, ఫేక్ నూస్ వీడియో కాల్స్ మొదలగు వాటి ద్వారా ఎలా మోసం చేస్తున్నారో విద్యార్థులకు వివరించారు. బలిమెల పోలీసు ఏఎస్‌ఐ సంజిత్ టాకరీ మాట్లాడుతూ.. సైబర్ నేరాళ్లపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
సైబర్ సెక్యూరిటీపై అవగాహన


