గుజరాత్‌లోని గిఫ్ట్ నగరం సందర్శన
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి గుజరాత్ 3 రోజుల పర్యటనలో భాగంగా భారత దేశంలోని మొట్టమొదటి ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రమైన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్ సిటీ)ని సందర్శించారు. ఆర్థిక, సాంకేతిక వృద్ధిని ప్రోత్సహించే గిఫ్ట్ సిటీలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న పర్యావరణ వ్యవస్థ. ఈ ప్రాజెక్ట్ దార్శనికతను ఆయన ప్రశంసించారు. ఇది భారత దేశ భవిష్యత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపొందించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని అభివర్ణించారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ కంభంపాటి అహ్మదాబాద్‌లోని చారిత్రాత్మక సబర్మతి ఆశ్రమంలో జాతిపితకు నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ సత్యం, శాంతి, నిస్వార్థ సేవ యొక్క ఆదర్శాలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సబర్మతి నదీ తీరాన్ని (అటల్ వంతెన) సందర్శించారు.
గుజరాత్‌లోని గిఫ్ట్ నగరం సందర్శన
గుజరాత్‌లోని గిఫ్ట్ నగరం సందర్శన


