రాయగడలో సమైక్యతా ర్యాలీ
రాయగడ: మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం శనివారం పట్టణంలో సమైక్యతా ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలొ భాగంగా స్థానిక గాంధీ పార్క్ వద్ద గల అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలక్టర్ అశుతోస్ కులకర్ణి, కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉలక, బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి.గొపిఆనంద్, పట్టణ ప్రముఖులు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని జాతి సమైక్యతకు అద్దం పట్టేలా ర్యాలీ నిర్వహించడం దేశభక్తిని చాటుకుంది.
రాయగడలో సమైక్యతా ర్యాలీ


