 
															జాతీయస్థాయికి తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రాజెక్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా స్వాభిమాన్ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని లలిత ఖిల్ రూపొందించిన ‘సేప్టీబోట్’ప్రాజెకుట జాతీయస్థాయి ప్రదర్శనకు అర్హత సాధించింది. పాస్కల్ సూత్రం ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ఈస్ట్ రీజియన్‌లోని కోల్‌కతా నుంచి ఏఎంపికై నవంబర్ 18న భోపాల్‌లో జరగబోయే జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. సేప్టీబోట్ మోడల్‌ను మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి దోరగూడ పంచాయతీ పరిధిలోని బురిడిపూట్ గ్రామానికి చెందిన లలిత ఖిల్ రూపొందించారు. ఈమె ప్రస్తుత్తం ఆర్‌ఎస్‌సీ–6 గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిత్రకొండ జలాశయంలో తరచూ పడవలు బోల్తా పడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని సేప్టీబోట్ ప్రాజెక్ట్‌ను రూపొందించి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రాజెక్టు రూపకల్పనలో ఆమెకు గైడ్ టీచర్ దేవబ్రత దాస్ సహకరించగా, ప్రధానోపాధ్యాయులు డంబరుధర్ గోలరీ, లలిత ప్రోత్సహించారు. విద్యార్థిని తల్లి దమయంతి ఖిల్, తండ్రి పర్షు ఖిల్‌లను గ్రామస్తులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
