జయపురం–భువనేశ్వర్ విమాన సర్వీసుల వేళల్లో మార్పు
జయపురం: శీతాకాలంలో జయపురం–భువనేశ్వర్ మధ్య విమాన సర్వీసులు వేళల్లో అధికారులు మార్పు చేశారు. శీతాకాలంలో త్వరగా సూర్యఅస్తమయం అవుతుంది. దీంతో ప్రతిదినం భువనేశ్వర్ నుంచి జయపురం బయలు దేరే మొదటి తొమ్మిది సీట్ల విమానం ఉదయం 7.20 గంటలకు బదులుగా 6.50 గంటలకు బయలు దేరి జయపురం 8.25 గంటలకు చేరుతుంది. తిరిగి జయపురం నుంచి 9.15 గంటలకు బదులుగా 8.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. అలాగే భువనేశ్వర్ నుంచి జయపురం బయలుదేరే రెండో విమానం ఉదయం11.15 గంటలకు బదులుగా 10.45 గంటలకు బయలు దేరి జయపు రం మధ్యాహ్నం 12.20 గంటలకు చేరుతుంది. అలాగే జయపురంలో మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరాల్సిన విమానం మధ్యా హ్నం 12.40 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటల కు విశాఖపట్నం చేరుతుంది. విశాఖలో మధ్యా హ్నం 2.45 గంటలకు బదులుగా రెండు గంటలకు బయలుదేరి 2.45 గంటలకు జయపురం చేరుతుంది. జయపురం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బదులుగా మూడు గంటలకు బయలు దేరి సాయంత్రం 4.45 గంటలకు చేరుతుంది.


