ఉచిత గుండె వైద్య శిబిరం
జయపురం: జయపురం ఫూల్‌బెడ గ్రామ ప్రాంతంలో కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఉచిత శిశు గుండె జబ్బుల పరీక్ష శిబిరం నిర్వహించారు. కొరాపుట్ జిల్లా వైద్య విభాగం, రాష్ట్రీయ బాల ఆరోగ్య విభాగం సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 14 పంచాయతీ సమితిల నుంచి అపుడే పుట్టిన శిశువుల నుంచి 18 ఏళ్ల వయసులోపు 100 మందికి హృద్రోగ వైద్య పరీక్షలు నిర్వహించారు. విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి చెందిన శిశు హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ రాజు రోగులను పరీక్షించారు. 44 మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి తరలించినట్టు రాష్ట్ర బాల ఆరోగ్య విభాగ మేనేజర్ సంతోష్ కుమార్ గోపీ వెల్లడించారు. జిల్లా ఆస్పత్రి అధికారి డాక్టర్ దిల్లీప్ కుమార్ బిశ్వాల్, జిల్లా కేంఽద్ర ఆస్పత్రి శిశు వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్ పాత్రో, ఆస్పత్రి మేనేజర్ రూపసి మధుశ్మిత నాయిక్, తధాగత దాస్, రాష్ట్ర బాల ఆరోగ్య విభాగ ఆస్పత్రి పరీక్ష, చికిత్సకేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.


