విజిలెన్స్ వలలో పోలీసు అధికారి
జయపురం: సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసుస్టేషన్‌లో ఎ.ఎస్.ఐగా పనిచేస్తున్న నరసింగదొర ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ గృహ హింస కేసులో అరెస్టయిన వ్యక్తికి బెయిల్‌పై విడుదల చేసేందు కు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పర్లాకిమిడి: మోంథా తుఫాన్ బాధితులకు స్థానిక బిజూ పట్నాయక్ కల్యాణ మండపంలో రెండురోజులుగా ఆశ్రయం కల్పించారు. లోత ట్టు ప్రాంతాలు, పూరిళ్లల్లో నివసిస్తున్న పేదల కు భోజనం, వసతిని పర్లాకిమిడి పురపాలక సంఘం కల్పించింది. మిగతా వార్డులలో కూ డా పేదలకు భోజనం, వసతిని కల్పిస్తున్నారు.
భువనేశ్వర్: మోంథా తుఫాన్ ప్రభావంతో +2 పరీక్షల దరఖాస్తులను దాఖలు చేసేందుకు గడువు పొడిగించారు. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం వచ్చే ఏడాది వార్షిక పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థులకు దరఖాస్తుల దాఖలు గడువు ఈ నెల 28వ తేదీతో ముగిసింది. ఈ గడువును నవంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. గడువు తేదీ పొడిగించాలని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి అభ్యర్థనలు అందడంతో ఉన్నత మాధ్యమిక విద్యా మండలి సీహెచ్‌ఎస్‌ఈ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి బుధవారం రాజ్‌భవన్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గవర్నర్ సచివాలయం సమగ్ర పని తీరుపై సమీక్షించారు. ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, ప్రజా సేవా కార్యకలాపాలు, సచివాలయం భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సమష్టి కృషితో అధికారిక, సంస్థాగత, ప్రజా సేవా కార్యకలాపాల సజావుగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: ప్రైవేట్ బస్సు అదుపుతప్పింది. బుధవారం కంగుతుమ ఘాటీ మలుపులో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కాసీపూర్ నుంచి మండిబిసి వైపు వెళ్లున్న లక్ష్మీ బస్ కంగుతుమ ఘాటీ మలుపులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్‌లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు గాయపడ్డారు. డ్రైవరు బస్సును చాకచక్యంగా నడపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాసీపూర్‌లో వారపు సంత కారణంగా బస్సులో 46 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారికి కాసీపూర్ హాస్పిటల్‌కు తరలించారు.
అరసవల్లి: కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హంసనావికోత్సవం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. నవంబర్ 2న సాయంత్రం 4 గంటల నుంచి ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్కరిణిలో 12 సార్లు స్వామివారి ఉత్సవమూర్తులు విహరించనున్నారు. వాహనంలోకి అనుమతుల విషయంలో మత్స్యశాఖాధికారులదే తుది నిర్ణయమని ఈవో ప్రసాద్ ప్రకటించారు. ఉత్సవానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆలయం తరఫున పోలీస్, రెవెన్యూ, ఫైర్, మత్స్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా వైద్యశాఖ, విద్యుత్ తదితర అనుబంధ శాఖాధికారులకు లేఖలు రాశారు. ఈమేరకు సిబ్బందిని నియమించేలా చర్యలుంటాయి.
విజిలెన్స్ వలలో పోలీసు అధికారి
విజిలెన్స్ వలలో పోలీసు అధికారి
విజిలెన్స్ వలలో పోలీసు అధికారి


