శబరిమలలో ఉచిత అన్నదానం
రాయగడ: కేరళలో శబరిమల భక్తులకు అఖిలభార త చిన్ముద్ర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత అన్నదా నం నిర్వహించేందుకు సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని గుణుపూర్‌లో అయ్యప్ప స్వామి మందిరం ప్రాంగణంలో బుధవారం ట్రస్ట్ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 20 వరకు శబరిమల సమీపంలోని పంబా–నిలక్కల్ రహదా రి మధ్యలో ఉచిత అన్నదాన ప్రసాదం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఒడిశా విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొరాపుట్ జిల్లా జొలాపుట్ ప్రాంతానికి చెందిన బడుగు గుప్తేశ్వరరావును నియమించారు. ట్రస్ట్ జాతీయ ప్రతినిధులు పైలా ఆదినారాయణ, మోహన్ రెడ్డి, రుద్ర కోటేశ్వరరావు తదితరులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గురుస్వామి అనంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.


