అంకితభావంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Oct 29 2025 9:31 AM | Updated on Oct 29 2025 9:31 AM

అంకిత

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వి.రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు ఏసీబీ విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ కె.భాస్కరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి 1
1/1

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement