గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు

Oct 29 2025 9:31 AM | Updated on Oct 29 2025 9:31 AM

గంజాయ

గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు

ఆటో ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్‌ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు చెప్పారు. ఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాల్యాద్రి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. ట్రాలీ బ్యాగ్‌ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కళాశాలలో తనిఖీలు

ఇచ్ఛాపురం: పట్టణంలోని స్వర్ణభారతి జూనియర్‌ కళాశాలను ఆర్‌ఐఓ తవిటినాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ల్యాబ్‌లను పరిశీలించారు. మోంథా తుఫాన్‌ నేపథ్యంలో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ చాట్ల తులసీదాస్‌, రాము, ప్రిన్సిపాల్‌ జె.జయప్రకాష్‌, సందీప్‌, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

టెక్కలి రూరల్‌: మండలంలోని నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే గేటు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్‌కు చెందిన బెహరా కన్న మూలపేట పోర్టులో పనిచేస్తూ తన అత్తగారి గ్రామమైన సంతబొమ్మాళి మండలం ఆకాశ లక్కవరంలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి భార్య సుకన్య(ఐదు నెలల గర్భిణి)తో కలసి ద్విచక్రవాహనంపై టెక్కలి వైపు వస్తుండగా నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వే గేటు దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో స్థానికులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కన్నకు కుడి చెయ్యి విరగ్గా.. సుకన్యకు సైతం గాయాలయ్యాయి. టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా ఎంపికలు వాయిదా

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడా ఎంపిక పోటీలు వాయిదా పడ్డాయి. తుఫాను కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన జరగాల్సిన ఎంపిక పోటీలను వాయిదా వేసినట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు తెలిపారు. తదుపరి ఎంపికల తేదీని త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు (ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి జిల్లా అధికారి వరకు) వారిలో ఉన్న క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించేందుకుగాను ఏటా సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీల పేరిట ఎంపిక పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

వృద్ధురాలిపై దాడి..బంగారం చోరీ

సారవకోట: బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ (80) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడితిలో నక్క చెల్లెమ్మ తన ఒంటరి వృద్ధురాలు సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చెవి, ముక్కుకు ఉన్న అరతులం బంగారు వస్తువులు తెంచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప చువ్వతో దాడికి పాల్పడటంతో మెడపై తీవ్ర గాయమైంది. వృద్ధురాలి కేకలు విని స్థానికులు చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అవంతరం బాధితురాలిని బుడితి సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుడితి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

గంజాయితో   ఒడిశా మహిళా అరెస్టు  1
1/2

గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు

గంజాయితో   ఒడిశా మహిళా అరెస్టు  2
2/2

గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement