భారీగా పట్టుబడిన గంజాయి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసు అధికారులు సోమవారం రాత్రి భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెట్రోలింగ్ జరుపుతుండగా పికప్ వ్యాన్, కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 4 క్వింటాళ్ల 15 కిలోల గంజాయిని అబ్కారీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.41.05 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తమకు వచ్చిన సమాచారం మేరకు అడవ పోలీసులు, అబ్కారీ సిబ్బంది మోహనా రోడ్డులో ఈ రెండు వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. అలాగే ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


