బడాసింహ్‌ను పంచాయతీగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి టోలోన పంచాయతీలో గల బడాసింహ్ గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని కోరుతూ 14 గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సబ్ కలెక్టర్ దుద్దుల్ అనిల్ అభిషేక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం టోలన పంచాయతీ పరిధిలో గల కడసింగ్, దెంగకుల్, డుంబడా, సంగోసగాడా, పొడ, సింజంగారిగా, కింతుంగో, ఓడోసార, ఖోరోలా, తోడరో, కింతురుంగా, ఓనరుంగూడ, రూపిడిసింగ్, లోవగోపాడి గ్రామాలు టోలోన పంచాయతీకి సుమారు 10 నుంచి 15 కిలో మీటర్ల దూరం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
ఈ గ్రామాలకు సమీపంలో గల బడాసింహ్ గ్రామాన్ని పంచాయతీగా గుర్తిస్తే ఎన్నో సౌకర్యలు పొందుతామని వినతిపత్రంలో పేర్కొన్నారు.


