వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పేర్లవీధికి చెందిన కోరాడ రమణమ్మ(96), ప్రశాంతినగర్‌కు చెందిన పొట్నూరు వెంకటనారాయణ(83), రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కలిగి ఆదినారాయణ (67) మృతి చెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతల కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్‌తో పాటు సెక్రటరీ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, సభ్యులు శనివారం అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.
రమణమ్మ
ఆదినారాయణ
వెంకటనారాయణ
వారి నేత్రాలు సజీవం
వారి నేత్రాలు సజీవం


