కోడూరుకు అపూర్వ స్వాగతం
పర్లాకిమిడి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోడూరు నారాయణరావును పార్టీ అధిష్టానం ఇటీవల నియమించింది. గజపతి జిల్లా గుసాని సమితి లాబణ్యగడ, గారబంద, బాగుసల, కంట్రగడ, ఉప్పలాడ, ఏడోమైలు మీదుగా పర్లాకిమిడికి బుధవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి పలాస చేరుకున్నారు. కారులో దారిపోడుగునా మాజీ ఎమ్మెల్యే కోడూరుకు పూల మాలలు వేసి, బాణసంచా కాలుస్తూ అపూర్వ స్వాగతం లభించింది. పర్లాకిమిడి చేరిన తరువాత కోడూరు నారాయణరావు మార్కెట్ జంక్షన్ వద్ద మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర శోబోరో, జిల్లా సాధారణ కార్యదర్శి ప్రశాంత్, ఉప్పలాడ ఆర్.ఎం.సి.ఎస్ డైరక్టర్ బల్ల ధనుంజయ, కోడూరు జీవన్, కిరణ్ తదితరులు ఉన్నారు.


