కాళీ పూజలకు పోటెత్తిన భక్తులు
రాయగడ: స్థానిక బ్లాక్ కాలనీ సమీపంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళీపూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కాళీమాతకు సమర్పించే సంధ్యా హారతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కాళీమాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
● మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా బెంగాలీ సంప్రదాయంలో జగ్గన్నాద్‌పల్లి గ్రామంలో సర్వజనానీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. కోరుకొండ, మాత్తిలి, డ్యామ్‌సైడ్, కలిమెల, పోడియ, యం.వి.43 గ్రామాల్లో కూడా పూజలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కాళీ పూజలకు పోటెత్తిన భక్తులు
కాళీ పూజలకు పోటెత్తిన భక్తులు


