 
															పోలీసుల సేవలు చిరస్మరణీయం
● రాయగడ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్
రాయగడ:
స్థానిక చందిలి పోలీస్ స్టేషన్ సమీపంలోని రిజర్వ్ పోలీస్ మైదానంలో మంగళవారం 66వ పోలీస్ సహీద్ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించింది. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సహీద్ స్థూపం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. పోలీసు సేవల చిరస్మరణీయమని కొనియాడారు. శాంతి భద్రతలు పరిరిక్షించే విషయంలో అమరులైన ఎంతోమంది పోలీసుల త్యాగం మరువలేనిదని అన్నారు. అనంతరం అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన వారికి నగదు బహుమతులు అందించి సన్మానించారు.
 
							పోలీసుల సేవలు చిరస్మరణీయం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
