షణ్ముఖపాత్రోకి ఘన నివాళి
కొరాపుట్: గుండె పోటుతో మరణించిన ప్రముఖ న్యాయవాది, సంఘ సేవకుడు షణ్ముఖ పాత్రో (50)కి న్యాయవాదులు నివాళులర్పించారు. నబరంగ్‌పూర్ బార్ ఆసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.
నబరంగ్‌పూర్‌లో న్యాయవాద వృత్తి ప్రారంభించి అనంతరం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా సేవలు అందించారన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల సేవలకు ప్రారంభించిన గోవిందాలయ ట్రస్ట్‌కి సహాయ, సహాకారాలు అందించడానికి న్యాయవాదులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరాజుద్దిన్ ఆహ్మద్, సంతోష్ మిశ్ర, రఘునాథ పాడి, తదితరులు పాల్గొన్నారు.


