
వలస కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం
పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ బ్లాస్టింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన మోహనా బ్లాక్ వలస కార్మికులు భాస్కర్ బిసాయి, టుకునా దొళాయి కుటుంబాలకు బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి గురువారం మోహనా పంచాయతీ సమితి కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.4 లక్షల చొప్పున్న పరిహారం అందజేశారు. ఆగస్టు 3వ తేదీన కాకినాడలో ఒడిశాకు చెందిన వలస కార్మికులు ఒక బ్లాస్టింగ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, మోహనా బీడీవో రాజీవ్ దాస్, మోహనా సమితి చైర్మన్ రాజీవ్ శోబోరో తదితరులు పాల్గొన్నారు.