ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

Oct 10 2025 6:24 AM | Updated on Oct 10 2025 6:24 AM

ఘనంగా

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

పర్లాకిమిడి:

స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో గురువారం ఉత్కళమణి గోపబంధు దాస్‌ జయంతి ఉత్సవాన్ని ఆడంబరంగా నిర్వహించారు. కవి, సమాజసేవకుడు, సంఘ సంస్కర్త, జర్నలిస్టు, స్వతంత్ర ఒడిశా ఉద్యమంలో పాల్గొన్న గోపబంధు దాస్‌ ఆశయాలను ఆచార్యులు మురళీమోహన్‌ ప్రధాన్‌ విద్యార్థులకు తెలియజేశారు. సరస్వతీ శిశు విద్యామందిర్‌లో సేవా దినోత్సవంగా నిర్వహించారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఆచార్యులు సరోజ్‌ పండా ఆధ్వర్యంలో నిర్వహించారు.

రాయగడలో..

రాయగడ: ఉత్కళ సమ్మేళిని ఆధ్వర్యంలో గురువారం ఉత్కళమణి గొపబంధు దాస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పార్క్‌లో గల గొపబంధు దాస్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ చంద్ర జెనా హాజరై గొపబంధు దాస్‌ సేవలను కొనియాడారు. ఉత్కళ సమ్మేళిని అధ్యక్షుడు, న్యాయవాది బ్రజ సుందర్‌ నాయక్‌, సభ్యుడు సునిల్‌ చంద్ర పండా, తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌లో..

కొరాపుట్‌: ఉత్కళమణి గోపబంధు దాస్‌ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు. కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని గోప బంధు దాస్‌ విగ్రహానికి పార్టీలకు అతీతంగా ప్రజలు నివాళులర్పించారు. కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, మాజీ ఎమ్మెల్యే నిమయ్‌ సర్కార్‌, డీసీసీ అధ్యక్షుడు రుపుధర్‌ బోత్ర, తదితరులు గోపబంధు విగ్రహానికి నివాళులర్పించారు. కొట్‌పాడ్‌లో సిద్ధార్థ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఆవరణలో ఉన్న గోపబంధు విగ్రహం వద్ద జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది పంకజ్‌ పాత్రో, మేధావులు పాల్గొన్నారు.

జయపురంలో..

జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి, పండిత ఉత్కళమణి గోపబంధు దాస్‌ జయంతిని జయపురంలో గల పలు సంస్థల్లో గురువారం నిర్వహించారు. ఉత్కళ సమ్మిళినీ కొరాపుట్‌ జిల్లా శాఖ, పూజ సంసద్‌ జయపురం, స్థానిక టౌన్‌ హాల్‌ జంక్షన్‌లో గల గోపబంధు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్కళ సమ్మిళినీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు బినోద్‌ మహాపాత్రొ, జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మదన్‌మోహన్‌ నాయక్‌, పూజ్య సూజ సంసద్‌ అధ్యక్షుడు, ఇంజినీర్‌ కేదార్‌ నాథ్‌ బెహరా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బిరెన్‌ మోహన్‌ పట్నాయక్‌, బీజేడీ సీనియర్‌ నేత బాలా రాయ్‌, జయపురం అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ పరిచాలన కమిటీ మాజీ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి 1
1/5

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి 2
2/5

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి 3
3/5

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి 4
4/5

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి 5
5/5

ఘనంగా గోపబంధు దాస్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement