
పరామర్శ..
పర్లాకిమిడి: ఈ నెల 2వ తేదీన కురిసిన భారీ వర్షానికి స్థానిక కండ్రవీధిలో శంకర బెహరా ఇల్లు ఽకూలిపోయింది. ఆ కుటుంబాన్ని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం పరామర్శించారు. ఇల్లు నిర్మించుకోవడానికి బాధితుడు శంకర బెహరాకు కొంతమొత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని బాధితుడుకి హామీ ఇచ్చారు.
ఉత్తమ విద్యార్థులకు అభినందన
పర్లాకిమిడి: గుసాని సమితి కోర్సండ గ్రామంలో ప్రభుత్వ రాజీవ్ మెమొరియల్ ఉన్నత పాఠశాలలో చదివి 2024– 25 విద్యా సంవంత్సరంలో పదో తరగతి ఒడిశా బోర్డు పరీక్షల్లో జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన గుంపు రేణుశ్రీ (521/600), కలగ ప్రసన్న (520/600)ను పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు నగదు, మెమొంటోలతో గురువారం అభినందించారు. ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా రామరాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజశేఖరం, కమిటీ చైర్మన్ డి.కామేశ్వరం నాయుడు, జి.ఢిల్లీశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలపై ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించా రు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యుటేషన్లు, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే పని ప్రజలకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. పని ఒత్తిడి ఉన్నా అత్యవసరమైన పనులకు తప్పని పరిస్థితుల్లో హాజ రు కావాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్‌ఖాన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో సీఎస్‌డీటీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు జి.జయదేవి, పద్మావతి, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్: సింగుపురం ఫ్‌లైఓర్ బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఫార్చునర్ వాహనంలో విశాఖ పట్నం నుంచి ఇచ్ఛాపురం వెళ్తుండగా అదే రూట్‌లో వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
సీపీఎం నేతలపై కేసు కొట్టివేత
కొత్తూరు: వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2016లో పోరాటం చేసిన సీపీఎం నేతలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసును గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కొట్టివేసినట్లు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాదరావు తెలిపారు. ప్రభుత్వం పెట్టిన కేసులో నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టినట్లు చెప్పారు. కేసులో సీపీఎం జిల్లా నాయకులు భవిరి కృష్ణమూర్తి, గంగరాపు సింహాచలం, కె.నాగమణి, సిర్ల ప్రసాద్, కె.మిన్నారావు, ఽశంకరరావు, ఆఫీస్, ముఖలింగం తదితరులు ఉన్నారు. కేసును అడ్వకేట్ మహంతి అప్పారావు వాదించారు.
శ్రీకాకుళం: తమకున్న పలుకుబడితో అంతర్ రాష్ట్ర బదిలీ లకు తెరతీస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు గురువారం డిమాండ్ చేశారు. ఇకపై ఉపాధ్యాయ బదిలీలన్నీ పారదర్శకంగా, చట్టబద్ధంగా, అవినీతి, అక్రమాలు లేని విధంగా చేస్తామ ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారని, ఇప్పు డు పలుకుబడి బదిలీలు చేపట్టడం దారుణమన్నారు. బదిలీలు నిలుపుదల చేయనిపక్షంలో న్యాయపోరాటం తప్పదన్నారు.

పరామర్శ..

పరామర్శ..

పరామర్శ..