రాయగడ: స్థానిక సమితి కార్యాలయం సమీపంలో గల ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు కాళీ పూజలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి గురువారం మందిరం ప్రాంగణంలో ముహూర్తపు రాట కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్‌కు చెందిన శివకుమార్ పట్నాయక్, శివాజీ దాస్‌లు ముహూర్తపు రాట పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాయగడకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలొ గల తెరువలి సమీపంలో ఉన్న దక్షణ కాళి మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించి అక్కడి నుంచి పసుపు,కుంకుమలను తీసుకువచ్చి కాళీ మందిరంలో ఉంచారు. ఈ సందర్భంగా కాళీ మాత విగ్రహ తయారీలో తీసుకువచ్చిన పసుపు, కుంకుమలను కలసి రూపొందిస్తారని శివపట్నాయక్ తెలియజేశారు. గత 43 సంవత్సరాలుగా ఈ పూజలను నిర్వహిస్తున్నామని పూజల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సన్నహాలు చేస్తున్నామని చెప్పారు.
20 నుంచి కాళీ పూజలు ప్రారంభం